కాశీనాయన
Kasinayana కాశీనాయన | |
---|---|
![]()
కాశీనాయన
| |
జననం | నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లి |
నిర్యాణము | డిసెంబర్ 6, 1995 |
శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించారు. కాశిమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు రెండవ సంతానం ఈయన. ఈయన పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను గురు అతిరాచ గురువయ్య స్వామిచే ప్రభావితుడయ్యాడు[1]. అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమరి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. ఆయన డిసెంబరు 6, 1995 లో మరణించాడు.
విషయ సూచిక
కాశినాయన మండలం[మార్చు]
1995 డిసెంబరు 5వ తేదీ రాత్రి ( 1995 డిసెంబరు 6న ) మరణించిన ఈయన జ్ఞాపకార్ధం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశినాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసింది.
కాశినాయన ఆరాధనోత్సవాలు[మార్చు]
ఆయన పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలసింది. కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశిరెడ్డి నాయన భక్తులు, కడప జిల్లాలోని కాశినాయన మండలం లోని జ్యోతి క్షేత్రంలో కాశి నాయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్షెత్రం ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కూడా నాయనగారు ముందుగానే చేయించారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశినాయన ఏర్పాటు చేసారు.
కాశినాయన ఆశ్రమాలు[మార్చు]
జ్యోతి క్షేత్రమే కాకుండా కాశినాయన పేరు మీద తెలుగు నేల మీద దాదాపు వందకు పైగా అశ్రమాలు, గుళ్ళు వెలిశాయి. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతు నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు.
కాశినాయనపై పుస్తకాలు[మార్చు]
అతని జీవితంపై ఎన్నో పుస్తకాలు ముద్రించబడ్డాయి. వాటిలో శ్రీ కాశి నాయన పాదరేణువులు రచించిన సమర్థ సద్గురు కాశినాయన అనురాగ జీవితం ఒకటి.
చిత్రమాలిక[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ స్పీకర్స్ ట్రీలో కాశిరెడ్డి నాయన
Your Affiliate Money Making Machine is ready -
ReplyDeleteAnd getting it running is as easy as 1-2-3!
Here's how it works...
STEP 1. Choose which affiliate products you want to push
STEP 2. Add PUSH BUTTON traffic (this ONLY takes 2 minutes)
STEP 3. See how the system explode your list and sell your affiliate products on it's own!
Are you ready to make money ONLINE??
Check it out here