Friday, 25 November 2016

కదులుతున్న శివలింగం


దానికదే కదులుతున్న శివలింగంతవ్వి చూసిన శాస్త్రవేత్తలకే ఆశ్చర్యమేస్తోందట..

భూమ్మీద ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైనది, బహుశా మీరు ఇదివరకెన్నడూ ఇలాంటిది చూసి కూడా ఉండరు. అంతే కాదు కనీసం వినడం కూడా జరిగి ఉండదనుకోవచ్చు. శివలింగం ప్రత్యేకతేమిటి అనుకుంటున్నారా? ఐతే తెలుసుకోండి ఇక్కడున్న శివలింగం కదులుతోందండి! ఏంటీ ? కదిలే శివలింగమా! భలే చెప్పార్లే ఎక్కడైనా ఇలాంటి కదిలే శివలింగం ఉంటుందా అని నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమేనండి. కదిలే శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌‌లోని రుద్రపూర్కు వెళ్లాల్సిందే.

ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపురం లో ఉన్న దుగ్దేశ్వరనాథుడు కదులుతాడు. ఆలయం ప్రత్యేకత ఇదే. అలయలోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న అతిపురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఆలయం యొక్క శివలింగం కదులుతుంది. చాలా సార్లు కదులుతూ ఉంటుంది, అలా ఒక గంట కదలవచ్చు, లేదా ఐదు గంటలు కదలోచ్చు, ఒక్కోసారి ఇరవయి నాలుగు గంటలు కదులుతూనే ఉంటుందని చెప్తారు ఇక్కడి ఆలయంలోని అర్చకులు. ఇలాంటి సమయంలో అద్భుతాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా స్వామి వారిని చూడడానికి వస్తారు. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయ్యాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదంట. అందుకే వింతను చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతారు కదిలేశివలింగ ఆలయంలోకి, లింగం ఇంకా భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉందొ తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా జాడ కూడా తెలియకపోవడంతో విఫలంయ్యరంతా. . .

స్వయం భూ శివలింగం ఆద్భుతమైన శివలింగం ఇది
ఓం నమః శివాయ


No comments:

Post a Comment