వేదాలకు,యజ్ఞాలకు, ఉపనిషత్తులకు ఆవిర్భావభూమి మన భరతభూమి.ఈ సనాతన దివ్యభూమి సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో మహానుభావుడు అవతరించి సనాతనధర్మాన్ని కాపాడుతూ ఉంటారు.
అలాంటి మహానీయులే సద్గురు కాశీనాయనగారు.
నెల్లూరు జిల్లా,సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామంలో జన్మించిన కాశీనాయన నెల్లూరు,ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతమంతా నిరంతరం సంచరిస్తూ అందరిచేత ఎన్నో ధర్మ కార్యక్రమాలు నిర్వహింపచేస్తూ దేనికీ తానుఅంటక వినిర్మల జీవన విధానమును కొనసాగించిన పరమపురుషులు.
* వెయ్యి నూతన ఆలయాలు నిర్మించేదానికన్న ఒక ప్రాచీన జీర్ణఆలయాన్ని ఉద్దరించమని పెద్దలు ఉవాచ.ఈ వాక్కుని కాశీనాయనగారు నిర్వర్తించిన విధంగా మరెవ్వరూ చేయలేదేమో.పవిత్ర నల్లమల పర్వతశ్రేణులతోపాటు వెలిగొండ పర్వత సానువులలో ఎన్నో పురాతన ఆలయాల్ని జీర్ణోద్ధరణ గావించడమే కాకుండా అనేక నూతన ఆలయాల్ని వారి సంకల్పబలంతో నిర్మింపచేశారు.ఆవిధంగా సనాతన భారతీయ సంస్కృతికి "గోపురం" ప్రాధాన్యతను అంధించిన అవతార పురుషులు శ్రీకాశీనాయన.
* అనాదిగా మన పవిత్ర భారతదేశములో గోమాతకున్న ప్రాధాన్యతను గుర్తించి అనేక ఆశ్రములలో గోసంరక్షణ గావించుచూ "గోకులం" అవసరాలను తీరుస్తున్న మహాత్ములు శ్రీకాశీనాయన.
* నెల్లూరుజిల్లా ఆత్మకూరు నందు విద్యార్థులకు ఉచితవిద్యను అందిస్తుంది 'కాశీనాయన పాఠశాల' విద్యార్థులకు మంచివిద్యను ఉచితంగా అందిస్తూ పాఠశాల ఆవరణలోనే గాయాత్రిమందిరం ఏర్పాటుచేసి విద్యార్థుల్లో దైవీక గుణాలను ఏర్పాటుచేస్తూ తద్వారా "గురుకులం" ఆవశ్యకతను తెలియచెపుతున్న సద్గురువు శ్రీకాశీనాయన.
ఈ వేదభూమికి పట్టుకొమ్మలైన "గోపురం గోకులం గురుకులం" యొక్క సేవలు అందించడంతో పాటు అనేక వందల ఆశ్రమాల్లో నిరతాన్నదానయజ్ఞాన్ని గావిస్తున్న సమర్ధ సద్గురువు కాశీనాయనగారు.
ఆ మహాత్ముని జన్మదినం సందర్భంగా వారిని స్మరిస్తూ వారిసేవలో నిత్యం తరిస్తూ వారి ఆశయాలను నిర్వర్తిస్తున్న గురుబందువులందరి పాదపద్మములకు నమస్కరించుకుంటూ......
మీ
No comments:
Post a Comment