Saturday, 9 December 2017

om

భగవంతుడు_అనేవాడు_ఉన్నాడా? ఉంటే_నిరూపించగలరా?
భగవంతుడు_అనేవాడు_ఉన్నాడా? ఉంటే_నిరూపించగలరా?

👉 ఈప్రశ్న నేటి కాలంలో మనకి ఎదురయ్యేదే!! ఎక్కడో ఎందుకు ఇక్కడే ఈ ప్రశ్న ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంది. 
  👉 ముఖ్యంగా ఈ ప్రశ్నలు కేవలం హిందువులో మాత్రమే ఎదురయితాయి!!  ఫెషన్ కూడా అయిపోయింది నేను దేవుడ్ని నమ్మను, నాస్తికుడ్ని అని చెప్పుకుంటారు... 

👉 దీనికి సమాధానంగా ఒక "వేద పండితుడు" వివరణ:

అయ్యా!!! నీళ్లలో నిప్పు ఉన్నది, అసలు నీరే  నిప్పుగా ఉన్నది (ఆపోవాఅగ్నేరాయతనం) మాకు వేదంలో ఉన్నది అని ఎవరైనా వేద పండితులు చెప్పారను కోండి, ఎవరూ నమ్మరు. నీళ్లలో నిప్పు వేస్తే ఆరిపోతుంది.
【అలాంటిది నీళ్లలో నిప్పు ఉండడమేమిటి? ఈయన ఎంత అమాయకుడో? ఇంకా ఇటువంటిఉపన్యాసాలు చెప్పి జనాలను నమ్మించాలని  చూస్తున్నారు అని మనసులోనేనవ్వుకుంటారు.】
 ఎందుకంటే చాలామందికి తెలిసి నీళ్ళలో నిప్పు అనేది
దాక్కొని ఉండడం అసంభవం. తమ నమ్మకం తప్పని అంత త్వరగా ఒప్పుకోడానికి ఎవరూ సిద్ధపడి లేరు.

అదే ఓ సైంటిస్టు అయ్యా  నీళ్లలో నిప్పు ఉన్నది అని చెప్పాడనుకోండి,
ఆశ్చర్య పోతారు. అయినా పూర్తిగానమ్మరు. ఏది ఎలాగ నిరూపణ చేయండి అంటారు. ఆయన చెప్తారు. నీటిని చేతితో తాకగలం, కంటితో చూడగలం. కానీ నీటిలో ఉండే నిప్పును తాకలేం, నేరుగా కంటితో చూడలేం. ఎందుకంటే దాని శక్తి అమోఘం.
 ఒక వస్తువుగుండా ప్రవహింపచేసినట్లేతే
కనుక దానిని అనేక పనులకు సాధనంగా ఉపయోగించవచ్చు. దీపంగా వాడుకోగలం, ఆ వెలుగును చూడగలం. భూమిలో నుండి నీటిని తోడగలం. అనేక పనులు చేయగలం. ఆ నీటిలో నుండి వెలికి వచ్చిన నిప్పునే మనం “విద్యుత్” అనిపిలుచుకుంటున్నాం...
ఇదంతా విని అవునౌను నిజమే నీటిలో విద్యుత్ శక్తి ఉంది. దానిని మనం వాడుకుంటున్నాం కదా!? అంటూ ఒప్పుకుంటారు.

【ఒక వేదపండితుడు చెప్పిన విషయాన్ని  నమ్మడానికి ఇష్టపడని మనం ఒక సైంటిష్టు చెప్పగానమ్ముతున్నాం. కారణం చాలా సమయా లలో మనం బుద్ధిని ఉపయోగించకపోవడమే!】

 #వేదపండితుడు - సైంటిష్టు ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పారు. కానీ  వేదం అనగానే నేటి ఆధునికుల దృష్టిలో పెద్ద బూటకం. అది పాత చింతకాయ పచ్చడి వంటిది. ఎవరికీ పెద్ద ఆసక్తి ఉండదు. వేదం అంటే పూర్వకాలంలో కాలక్షేపానికి రాసుకున్న ఒక జీవన పద్ధతి. ఆ రోజులలో ప్రజలుబావిలో కప్పలు. వారికి ప్రపంచం తెలియదు. తమ చిన్న ప్రపంచంలోజీవించడానికి పెద్ద పనేమీ ఉండేది కాదు. అందుకే ఖాళీ ఎక్కువై రాసుకున్న గ్రంథాలు అవన్నీ. ఈ రోజులకు సరిపోవు. అయినా నిరూపణకు సరిపోని అంశాలు వేదంలో చాలా ఉన్నాయి. కనుక అవి అన్నీఅసమంజసమైనవే అనే వాదనలకు నిలువలేవు!! అని నేడుచాలామంది ఆధునికులయొక్క అభిప్రాయం...

చాలామంది గొర్రెలవలెనే ఆలోచించడానికి అలవాటుపడి నేటికీ అదే విధానంలోఉన్నారు. ఒక గొర్రె ఎటువెళితే వెనకాల గొర్రెలన్నీ అటే వెళతాయి. అలాగే నేటి కాలంలో పాప్ సాంగ్స్, ఫేస్ బుక్, వాట్సప్, సినిమాలు, డబ్బు మొ. వాటిలో కొట్టుకుపోతున్నారే కానీ మనమెటు వెళుతున్నాం అన్నది ఆలోచించడం లేదు. నూటికి ఎవరో ఒక్కరు మాత్రమే మనిషిలా తమ బుద్ధిని
ఉపయోగించగలరు. వారే నాయకులవుతున్నారు. మిగతావారు గొర్రెల వలె లోకాన్నిఅనుసరిస్తున్నారు.

కంటితో చూసినవి మాత్రమే నమ్ముతామంటే క్యారెట్ తింటే ఏ- విటమిన్ వస్తుంది అని డాక్టరు చెప్పినప్పుడు మీరు నమ్మకూడదు. కానీ నమ్ముతున్నారే!!   విద్యుత్ ను కంటితో చూడలేదు, చేతితో స్పర్శించ లేదు. కానీ విద్యుత్ అనేది ఉంది అని నమ్ముతున్నాము. విద్యుత్తు వలెనే భగవంతుడిని కూడా కంటితో చూడలేం, చేతితో స్పర్శించలేము.
   "ఎందుకంటే ఆయనను భరించ గలిగే శక్తి ఈ శరీరానికి లేదు. విద్యుత్ తగిలితే శరీరం ఎలా తట్టుకోలేదో అలాగే భగవంతుని స్పర్శనీ ఈశరీరం తట్టుకోలేదు."

 #ఒక పరిమితికి లోబడిన వస్తువులను మాత్రమే మనం కంటితోచూడగలం. ఆ పరిమితి కంటే తక్కువ ఉన్నా (అణువు),ఎక్కువ ఉన్నా (సూర్యుడు) మనం కంటితో చూడలేం. అలా చూడడానికి మనకి భూతద్దం వంటి ఓ సాధనం కావాలి. ఆలాగే
పరిమితికి లోబడిన శబ్దాలను మాత్రెమే మనం చెవులతో వినగలం. శబ్దం ఎక్కువ ఉన్నా వినలేం (చెవుడువస్తుంది), శబ్దం తక్కువ ఉన్నా మనకు వినబడదు. అంటే మనం చూడడానికి, వినడానికి, ముట్టుకోవాడనికి, వాసన చూడడానికి రుచి>చూడడానికి వీటన్నిటికీ పరిమితులు (Limitations) ఉన్నాయి.  "పాంచభౌతికమైన
మన శరీరమే పరిమిత మైనది అయినప్పుడు  అపరిమిత శక్తి కలిగిన భగవంతుని మనం ఈ శరీరంతో ఎలాచూడగలం, ఎలా మాట్లాడగలం?అలా చూడాలనుకోవడం మన అవివేకమే అవుతుంది."

విద్యుత్తును ఒక బల్బు ద్వారా ప్రసారం చేసి వెలుగుగా ఎలా
చూడగలుగుతున్నామో అలాగే మనసు అనే సాధనమునుఉపయోగించి మాత్రమే ఆ భగవంతుని దర్శించగలం.

【మనకు తెలియని విషయాలు అన్నీ అసత్యాలు కాదు. మన బుద్ధికి తెలియనంత మాత్రాన భగవంతుడు లేడనడం అవివేకం.】 జీర్ణప్రక్రియను మనకంటితో చూడలేము. కానీ ఎవరో ఒక సైంటిష్ట్ చెప్పాడని అది నమ్ముతున్నాం. 
#మరి #మన పూర్వీకులు ఋషులు చెప్పిన విద్యను మాత్రం బూటకం అని కొట్టిపాడేయడం ఎంత వరకు సబబు?  【వేదం అంటే అది ఓ సైన్స్, ఋషులు సైంటిస్ట్ లు. వారు ఎంతో కఠోర శ్రమ చేసి సాధించిన ఫలాలను వేదం రూపంలో మనకు అందించారు.
#భగవంతుడు_అనేవాడు_ఉన్నాడా

No comments:

Post a Comment

The Account We Forgot

 Writing The Account We Forgot 1. The Oxygen Account A person breathes about 740 kg of oxygen every year, which is produced by approximately...