Sunday, 20 November 2016

Sri Sri Sri Avadutha Kasinayana Foundation: sri sri sri Avadutha Kasinayana Foundation

Sri Sri Sri Avadutha Kasinayana Foundation: sri sri sri Avadutha Kasinayana Foundation: ఒక్కొక్కసారి  సలహాలతో అవసరం ఉండదు ...  ఎందుకంటే మనకు నిజంగా కావలసినది    సాయం చేసే ఒక చేయి ...   బాడవినె ఒక చెవి ...  అర్ధం చ...

sri sri sri Avadutha Kasinayana Foundation



ఒక్కొక్కసారి  సలహాలతో అవసరం ఉండదు ... 
ఎందుకంటే మనకు నిజంగా కావలసినది 
  సాయం చేసే ఒక చేయి ...
  బాడవినె ఒక చెవి ... 
అర్ధం చేసుకొనే ఒక మనసు 

sri sri sti avadutha kasinayana foundation


Friday, 11 November 2016

తాళపత్ర గ్రంధాల్లోని రహస్యం…ఈ జన్మలో చేసే పాపాలకు వచ్చే జన్మలో ఎలా పుడతారో తెలుసా..?

సమాజంలో ప్రాచీన కాలం నుంచే మంచి నడక నడత ఉండాలని అనేక నియమాలను పెడుతూ వచ్చారు. అంతే కాదు అవి ధిక్కరించిన వారు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారో శాస్త్రాల్లో వివరించారు. తప్పుచేసేవారు భయపడి పోయేలా వాటిని తెలియజెప్పారు. నమ్మకాల సంగేతాలున్నా గాని మంచి పౌరినిగా వేలగాలంటే కొన్ని పాపకార్యాలకు దూరంగా ఉండాలి. పూర్వ జన్మలో పాపం చేసినవారు ఈ జన్మలో ఎలా పుడతారో తాళపత్ర నిధి గ్రంధం లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ విషయాలు ప్రత్యేకంగా మీకోసం…
* గోహత్య చేసినవాడు తిరిగి మరుగుజ్జు గా జన్మిస్తాడు.
* శాస్త్రాన్ని అవమానించినవాడు పాండు రోగిగా జన్మిస్తాడు.
* స్త్రీని హత్య చేసినవాడు నిత్యరోగిగా పుడతాడు.
* అబద్దపు సాక్ష్యం చెప్పిన వాడు మూగవాడిగా పుడతాడు.
* అబద్దాలను వినేవాడు చీమై పుడతాడు.
* పుస్తకాలను దొంగిలించిన వాడు గుడ్డివాడుగా జన్మిస్తాడు.
* ఇష్టానుసారం వ్యభిచారించనవాడు అడవిలో ఏనుగుగా పుడతాడు.
* పిలువని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగా జన్మ ఎత్తుతాడు.
* మిత్రుద్దిని మోసం చేసినవాడు గద్ద అవతారమెత్తుతాడు.
* భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగా జన్మిస్తుంది.
* అమ్మకాల్లో మోసం చేసినవాడు గుడ్లగూబ గా పుడతాడు.
* భర్తను మోసం చేసిన ఆడది బల్లిగా పుడుతుంది.
* గురుపత్ని తో సంభోగం చేస్తే తొండగా జన్మిస్తాడు.
* అతి కామం కలిగినవాడు గుర్రంగా జనిమిస్తాడు.
* భార్యను హింసిస్తే మేకగా పుడతాడు.
ఇలా పూర్వ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో ఖచ్చితంగా శిక్ష తప్పదని మన పురాణాల్లో పేర్కొన్నారు

విలువలు తెలుసుకోకపొతే కూలబడేది మనమే

తాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు. అయితే హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు అని అడిగేవాళ్లకు లేదా ఎగతాళి చేసేవాళ్లకు అయన ఇలా సమాధానం చెప్పాడు. " తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది. ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే, తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు " అన్నాడు. అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే... మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట "మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి" అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది. ఇటు తనవారికి సందేశం ఇచ్చాడు. మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకీ సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోకపొతే కూలబడేది మనమే. మన సంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి అంటూ యావత్ భారత జాతికి ఈ విషయాన్నీ తెలియచేసాడు.

M Rajasekharredd

శ్రీ రామలింగేశ్వరుడు స్వయంభువు గా వెలసినదివ్యక్షేత్రం

maha-shivaratri

శ్రీ రామలింగేశ్వరుడు స్వయంభువు గా వెలసినదివ్యక్షేత్రం


క్రీ.శ 4-5 శతాబ్దాల్లో ఆంథ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన ప్రభువైన రెండవ మాథవవర్మ రాజథానియైన “ఇంద్రపాలనగరం” ఇదేనని చారిత్రక ఆథారాల ద్వారా తెలుస్తోంది. పదకొండు అశ్వమేథయాగాలు చేసి, తన సామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింపజేసిన మహావీరుడు రెండవమాథవవర్మ. అంటే ఎన్నో యజ్ఞ యాగాదులతో పునీతమైన పవిత్ర భూమి ఈ కీసరగుట్ట. రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరుడు స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం నేటి తెలంగాణా రాజథాని భాగ్యనగరానికి 40 కి.మీ దూరంలో ఉంది.
keesaragutta-ramalingeshwara-swamy-shiva-temple12

keesaragutta-ramalingeshwara-swamy-shiva-temple12స్వయంభు శ్రీ రామలింగేశ్వర స్వామి
శ్రీ రామచంద్రుడు రావణ సంహరణానంతరం అయోథ్యానగరానికి మరలి వెడుతూ, మార్గమథ్యంలో ఈ కొండ మీద కొద్దిసేపు ఆగాడట. ఈ ప్రదేశ ప్రభావమేమో కాని శ్రీ రామచంద్రుని మనస్సులో ఒక ఆలోచన కలిగింది. రావణ బ్రహ్మ సంహరణానంతరం తాను నిర్వర్తిస్తున్న శివలింగాల ప్రతిష్ఠల్లో భాగంగా ఈ కొండపై శివలింగ ప్రతిష్ఠ చేయాలనే ఆలోచన కలిగింది. మహర్షులు ముహూర్తం నిర్ణయించారు. వెంటనే ఆంజనేయుని పిలిచి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు కౌసల్యానందనుడు. రామాజ్ఞ కావడమే ఆలస్యం రివ్వుమని ఆకాశంలోకి ఎగిరాడు మారుతి.
కాని ముహూర్తసమయం సమీపిస్తున్నా కేసరీనందనుని జాడేలేదు. ఆలస్యమౌతోందని ఆలోచిస్తున్న శ్రీరాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శంకరుడు. ఆత్మలింగాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. ముహూర్త సమయానికి ప్రతిష్ఠాకార్యక్రమాన్ని ముగించి “థన్యో2హం” అనుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇంతలో నూటొక్క శివలింగాలను భుజాలమీద మోసుకుంటూ రామచంద్రుని ముందు నేలకు దిగాడు ఆంజనేయుడు.
పరిసరాలను చూచి, పరిస్థితిని అర్థంచేసుకున్నాడు మారుతి. తాను పడిన శ్రమంతా వృథా అయిందని అలిగి, బాధతో తాను తెచ్చిన శివలింగాలను కొండపైన చెల్లాచెదరుగా విసిరేశాడు. (ఆ శివలింగాలే ఈనాడు కొండమీద ఆలయ ప్రాంగణం వెలుపల దర్శనమిస్తుంటాయి). మారుతి చేష్టలను చూచి చిరునవ్వుతో అనుగ్రహించాడు సీతా మనోభిరాముడు. తన భక్తుల మనోభవాలను మన్నించగల మహనీయుడు కదా మన శ్రీరాముడు. మారుతిని
“ఆలయంలోని ఈశ్వర దర్శనానికంటే ముందే నువ్వు తెచ్చిన శివలింగాలను, నిన్ను భక్తులు దర్శిస్తారని, ఆ తరువాతే శ్రీ రామలింగేశ్వరుని దర్శిస్తారని” వరమిచ్చాడు. అంతే కాదు. మారుతి తెచ్చిన శివలింగాల్లో ఒక దానిని ప్రధాన ఆలయానికి ఎడమవైపు కొద్దిదూరంలో శ్రీ రామలింగేశ్వరునికి అభిముఖంగా ప్రతిష్ఠించాడు. (ఆశివలింగాన్నే శ్రీమారుతి కాశీవిశ్వేశ్వరుడుగా భక్తులు సేవించు కుంటున్నారు). అంతే కాకుండా ఇక నుండి ఈ కొండ “కేసరి గిరి”గా పిలువబడుతుందని కూడ అనుగ్రహించాడు ఆంజనేయుని శ్రీరామచంద్రుడు. కేసరి ఆంజనేయుని తండ్రి కదా! ఆనాటి నుండి ఆ పేరుతోనే ఈ కొండ కేసరి గిరి, కీసర గిరి, కీసర, కీసరగుట్టగా వ్యవహరించబడుతోంది. ఇదంతా స్వామి తనను అనుగ్రహించడానికి చేసిన పనేనని తెలియని వాడు కాదు గదా మన నవవ్యాకరణ పండితుడు, జ్ఞాన గుణ సాగరుడైన హనుమంతుడు. అందుకే వినయంగా చేతులు జోడించి, స్వామి ముందు నిలబడి పోయాడు భక్తాంజనేయుడై.
ప్రథాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇందులో ఫ్రథాన దైవం శ్రీరామలింగేశ్వరుడు. ఈశ్వర ప్రసాదితమై, శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడుటం వలన ఇది స్వయంభూలింగమై పూజలందుకుంటోంది. ప్రథానాలయం ముఖమండప, అంతరాలయ, గర్భాలయాలుగా నిర్మించబడింది. మహామండపాన్ని ఇటీవల నిర్మించారు.
ముఖమండపంలో శ్రీస్వామి వారికి కుడి ఎడమలుగా రెండు ఉపాలయాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న ఉపాలయంలో పార్వతీదేవి, ఎడమవైపు పాలయంలో శివగంగాదేవి దర్శనమిస్తారు. ముఖమండపంలో స్వామికి కుడివైవున ఉన్న వేదికపైన ఆంజనేయుడు, వినాయకుడు, శివలింగము, ఎడమవైపున ఉన్నవేదికపైన వల్లీదేవసేనా
ధ్వజస్థంభము చెంత కాలభైరవమూర్తిని మనం సేవించుకోవచ్చు. శ్రీ స్వామికి ఎదురుగా భక్తులు ఇచ్చేముడుపులను కాపలాకాస్తూ, ప్రభువు ఆజ్ఞకు దివారాత్రాలు ఎదురుచూసే నందీశ్వరుడు ప్రత్యేకమండపంలో గంభీరముద్రలో దర్శనమిస్తాడు. కోరికలు తీర్చే తండ్రిగా భక్తులు ఈ స్వామిని సేవిస్తారు. రాహుకేతు పూజలు ఇక్కడ ప్రత్యేకం. శ్రీ రాముని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడుగా ఈయన శ్రీ రామలింగేశ్వరుడైనాడు.
ప్రదక్షిణ మార్గం చూసుకొని, శ్రీ స్వామివారి ఎడమవైపుకు రాగానే కొంచెం దూరంలో శ్రీ మారుతి కాశీవిశ్వేశ్వరాలయం ఆహ్వానం పలుకుతుంది. ఆ స్వామిని దర్శించుకొని, కొద్దిగా ఎడమకు నడిస్తే ప్రత్యేక ప్రాంగణంలో అక్కన్న- మాదన్న ఆలయాలు కనిపిస్తాయి. (అక్కన్న-మాదన్నలు గోల్కొండ(గొల్లకొండ) సంస్థానంలో మంత్రులు)
ఒకే కప్పుక్రింద నిర్మించబడిన మూడు ఆలయాలు ఇవి. వీటికి క్రీ.శ 2005లో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయం, అంతరాలయం, వేరువేరుగా ముఖమండపం కలిపి నిర్మాణం జరిగింది. ఈ ఆలయాల్లో మధ్యగుడిలో శివపంచాయతనాన్ని, వారికి కుడివైపు శ్రీలక్ష్మీనరసింహస్వామిని, ఎడమవైపు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తిని ప్రతిష్ఠించారు. ముఖమండపంలో చిన్నమందిరాలలో వివిధ దేవీ, దేవతా మూర్తుల విగ్రహాలను మనం చూడవచ్చు.
ఈ ఆలయాలకు వెనుక వైపు నాగదేవత ఆలయం నిర్మించబడింది. సంతానార్థులైన సువాసినులు ఇక్కడ ప్రత్యేక పూజలు, ముడుపులు చెల్లిస్తారు. సంతానవతులైన అనంతరం మొక్కులు తీర్చుకుంటారు.
ఆలయానికి ఎదురుగా మరొక ఆంజనేయ ఫలకం కన్పిస్తుంది. దీని ప్రక్కనే అక్కన్న-మాదన్నలు వేయించిందిగా చెపుతున్న భక్తాంజనేయ ముద్ర కల్గిన ఏకశిలా జయస్థంభాన్ని చూడవచ్చు.
ఆలయ ప్రాంగణం వెలుపల ఎక్కడ చూసినా శివలింగాలే కన్పిస్తాయి. శివరాత్రి పర్వదినాల్లో భక్తులు వేలకొలది ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఆనాడు భక్తులు ఎవరికి వారు ఒక్కొక్క శివలింగాన్ని ఎన్నుకొని స్వహస్తాలతో ఆ స్వామికి అభిషేకం చేసి, విభూతి పూసి, బొట్టుపెట్టి, పూమాలలు వేసి, టెంకాయకొట్టి పూజించేటప్పుడు వాళ్ల ముఖాల్లో కన్పించే ఆనందం అనిర్వచనీయమైంది.
ఆలయానికి అభిముఖంగా దూరంగా కొండమీద మరొక భక్తాంజనేయ మందిరం కన్పిస్తుంది. దీనికి వెనుక భాగంలో పన్నెండడుగుల అడుగుల ఎత్తైన వేదికపై ముకుళితహస్తుడైన మరొక శ్రీ ఆంజనేయమూర్తి స్వామికి అభిముఖంగా దర్శనమిస్తాడు.
పురావస్తుశాఖ వారు ఈ కొండమీద జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రదేశ పవిత్రతను ఇనుమడింప చేసే విశేషాలు ఎన్నో వెలుగు చూశాయి. క్రీ.శ 4-5 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండినులలో ప్రసిద్ధుడైన రెండవమాథవవర్మ రాజథాని ఇంద్రపాలనగరము ఇదేననడానికి ఆథారాలు లభించాయి. ఈ మహారాజు వేయికి పైగా యజ్ఞ యాగాదులను నిర్వహించిన మహాపురుషుడు. పదకొండు అశ్వమేథ యాగాలను చేసి, ఆంద్రసామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింప చేసిన మహావీరుడు. ఈ ప్రదేశంలో జరిపిన త్రవ్వకాలలో ఈ కొండచుట్టు విస్తృతపరిథిలో పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించిన కోటగోడ పునాదులు, రాజప్రాసాదం, పూజామందిరాలు, వివిథ కట్టడాలు బయటపడ్డాయి. శివలింగాలు, నంది, గణేశుడు మొదలైన దేవతాప్రతిమలు, పాత్రలు, నాణేలు, పూసలు మొదలైనవి వెలుగుచూశాయి. ఇప్పటికీ పరిక్షగా చూస్తే అక్కడక్కడ కొన్ని శిథిల కట్టడాలు మనకు కన్పిస్తున్నాయి
ఆలయం వరకు చక్కని ఘాటురోడ్డు సౌకర్యం ఉంది హైద్రాబాద్ నుండి 40 కి.మీ దూరంలో ఉన్నఈ ఆలయానికి ఇ.సి.ఐల్ నుండి, నగరంలో వివిథ ప్రాంతాలనుండి రవాణాసౌకర్యాలున్నాయి. కొండమీద భోజన, ఫలహార , తేనీరుకు హోటల్సు ఉన్నాయి. అన్న దానసత్రాలు కూడ కొన్ని ఉన్నాయి. చక్కని ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన శ్రీ రామలింగేశ్వరుని కీసరగుట్ట చూడదగిన దివ్యక్షేత్రం.


గురు పౌర్ణమి శుభాకాంక్షలు

 గురు పౌర్ణమి శుభాకాంక్షలు  జై కాశీ నాయన