Sunday, 3 December 2017

Sri Sri Sri Avadutha kasinayana Foundation

Golden words

  1. "The sand and the sugar are mixed, and the milk is the only one to drink sugar, the milk is water together, and the water is just like a duck, and the water will be like it, and immediately it will drain the water, and it will live in mud, but its body Goal Mall Mall (the desired item) is in the world. Leave the goal (unreal) and take the mall. " - Sri Ramakrishna Paramhansa

Sri Sri Sri Avadutha kasinaya Foundation

Golden words

"ఇసుక, చక్కెర కలిసిపోయి వున్నాయి; చీమలా చక్కెరను మాత్రమే ఏరుకో. పాలూ నీరు కలిసి వున్నాయి; హంసలా కేవలం పాలను స్వీకరించి నీటిని వదలివేయి. బాతులాగా వుండు. నీరు దాని వంటి మీద పడుతుంది. వెంటనే అది నీటిని విదలించి వేస్తుంది. బురద చేపలా ఉండు. అది బురదలో నివసిస్తుంది; కానీ దాని దేహం శుధ్ధంగా వుంటుంది. ఈ ప్రపంచంలో నిత్యానిత్యాలు కలగలసి ఉన్నాయి. గోల్ మాల్లో మాల్ (కావలసిన వస్తువు) ఉంది. గోల్ (అవాస్తవమైనది) వదలిపెట్టి మాల్ తీసుకో." - శ్రీ రామకృష్ణ పరమహంస.

Saturday, 9 September 2017

kasinayana








 ఏ పోరాపాటూ చేయట్లేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నిం చాట్లేదన్నమాట
If you do not have any fighting, you can not try anything new

Monday, 28 August 2017

om


*అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం*

*దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యం*

*సకల గుణ నిధానం వాన రాణా మధీశం*

*రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి*



ॐ నమో ఆంజనేయాయనమః



బుధిర్బలమ్ యశో  ధైర్యం
నిర్భయత్వం  ఆరోగత 
అజాడ్యం  వాక్  పటుత్వంచ  
హనుమత్  స్మరణాత్  భవేత్

ॐ నమో ఆంజనేయాయనమః
🌹

Thursday, 24 August 2017

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు పెంచండి .సర్వ సౌఖ్యాలను పొందండి.


  • జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనం లో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలను ఎలాసంభవిస్తాయో వాటికి ఏగ్రహములకు శాంతులు చెయ్యాలో ఈశాస్త్రము లో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణముగా మనము నక్ష్తర శాంతులు గ్రహ శాంతులు జరిపించుకుంటూంటాము.

మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా వుంటె తొలగటమే గాక .సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు.మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధమ్ గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది మీ జీవితం లో.
మీరునాటవలసిన మొక్కనుగాని లేక ,విత్తనాన్ని గాని మీకు ఎక్కడవీలైతే అక్కడ ,రోడ్లపక్కన వీధి పక్కలన ,పార్కు,కొండ,అడవి దేవాలయం ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటాలి. దానిని పెరిగేలా శ్రద్ద చూపాలి. మీకు నాటాక వాటి పోషణ కు సమయము చాలకుంటే మీస్వతం దబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయాలి.మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీరు నాటిన ప్రదేశానికి సంవత్సరం లో ఒక్కసారైనా వెళ్ళి నమస్కరించి రావాలి. మీగ్రామము లో లేదా నివాస సమీపం లో ఎక్కద ఆవృక్షము కనిపించినా నమస్కరించాలి.ఎట్టి పరిస్థితి లోనూ ఆవృక్షాన్ని దూషించటం గాని నరకటం గాని చేయరాదు.పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించిచూడండి వారి జీవితాన శుభాలు వెల్లివిరుస్తాయి. ఇది చదివిన వెంటనే మీ మిత్రులందరికీ తెలియజేయండి. మీరంతా కలసి రోడ్డుపక్కన ఒకప్రదేశములో మీ అందరి నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను సామూహికంగా పెంచటంద్వారా అందరికీ వేడుకగా వుంటుంది కూడా.

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి
————————————–
అశ్వని – జీడిమామిడి
భరణి – దేవదారు
కృత్తిక – అత్తి [మేడి]
రోహిణి – నేరేడు
మృగశిర – మారేడు
ఆరుద్ర -చింత
పునర్వసు – గన్నేరు
పుష్యమి – పిప్పలి
ఆశ్లేష – బొప్పాయి
మఖ – మర్రి
పుబ్బ – మోదుగ
ఉత్తర – జువ్వి
హస్త – కుంకుడు
చిత్త – తాడి
స్వాతి – మద్ది
విశాఖ – మొగలి
అనూరాధ – పొగడ
జ్యేష్ఠ – కొబ్బరి
మూల – వేగి
పూర్వాషాఢ – నిమ్మ
ఉత్తరాషాఢ – పనస
శ్రవణం – జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ – జమ్మి
శతభిషం – అరటి
పూర్వాభద్ర – మామిడి
ఉత్తరాభాద్ర -వేప
రేవతి -విప్ప

గురు పౌర్ణమి శుభాకాంక్షలు

 గురు పౌర్ణమి శుభాకాంక్షలు  జై కాశీ నాయన