Monday, 28 August 2017

om


*అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం*

*దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యం*

*సకల గుణ నిధానం వాన రాణా మధీశం*

*రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి*



ॐ నమో ఆంజనేయాయనమః



బుధిర్బలమ్ యశో  ధైర్యం
నిర్భయత్వం  ఆరోగత 
అజాడ్యం  వాక్  పటుత్వంచ  
హనుమత్  స్మరణాత్  భవేత్

ॐ నమో ఆంజనేయాయనమః
🌹

Thursday, 24 August 2017

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు పెంచండి .సర్వ సౌఖ్యాలను పొందండి.


  • జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనం లో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలను ఎలాసంభవిస్తాయో వాటికి ఏగ్రహములకు శాంతులు చెయ్యాలో ఈశాస్త్రము లో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణముగా మనము నక్ష్తర శాంతులు గ్రహ శాంతులు జరిపించుకుంటూంటాము.

మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా వుంటె తొలగటమే గాక .సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు.మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధమ్ గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది మీ జీవితం లో.
మీరునాటవలసిన మొక్కనుగాని లేక ,విత్తనాన్ని గాని మీకు ఎక్కడవీలైతే అక్కడ ,రోడ్లపక్కన వీధి పక్కలన ,పార్కు,కొండ,అడవి దేవాలయం ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటాలి. దానిని పెరిగేలా శ్రద్ద చూపాలి. మీకు నాటాక వాటి పోషణ కు సమయము చాలకుంటే మీస్వతం దబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయాలి.మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీరు నాటిన ప్రదేశానికి సంవత్సరం లో ఒక్కసారైనా వెళ్ళి నమస్కరించి రావాలి. మీగ్రామము లో లేదా నివాస సమీపం లో ఎక్కద ఆవృక్షము కనిపించినా నమస్కరించాలి.ఎట్టి పరిస్థితి లోనూ ఆవృక్షాన్ని దూషించటం గాని నరకటం గాని చేయరాదు.పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించిచూడండి వారి జీవితాన శుభాలు వెల్లివిరుస్తాయి. ఇది చదివిన వెంటనే మీ మిత్రులందరికీ తెలియజేయండి. మీరంతా కలసి రోడ్డుపక్కన ఒకప్రదేశములో మీ అందరి నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను సామూహికంగా పెంచటంద్వారా అందరికీ వేడుకగా వుంటుంది కూడా.

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి
————————————–
అశ్వని – జీడిమామిడి
భరణి – దేవదారు
కృత్తిక – అత్తి [మేడి]
రోహిణి – నేరేడు
మృగశిర – మారేడు
ఆరుద్ర -చింత
పునర్వసు – గన్నేరు
పుష్యమి – పిప్పలి
ఆశ్లేష – బొప్పాయి
మఖ – మర్రి
పుబ్బ – మోదుగ
ఉత్తర – జువ్వి
హస్త – కుంకుడు
చిత్త – తాడి
స్వాతి – మద్ది
విశాఖ – మొగలి
అనూరాధ – పొగడ
జ్యేష్ఠ – కొబ్బరి
మూల – వేగి
పూర్వాషాఢ – నిమ్మ
ఉత్తరాషాఢ – పనస
శ్రవణం – జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ – జమ్మి
శతభిషం – అరటి
పూర్వాభద్ర – మామిడి
ఉత్తరాభాద్ర -వేప
రేవతి -విప్ప

om on om



Wednesday, 23 August 2017

om




*ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం,బద్ధపద్మాసనస్థం*

*పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధి నేత్రం ప్రసన్నమ్,*

*వామాంకారూఢసీతాముఖ*
*కమలమిళల్లోచనం నీరదాభం*

*నానాలంకారదీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్.*


     

Tuesday, 22 August 2017

Personality development principles
======================
If she fights against me, the woman will be Amma.
Caterpillar turns into a butterfly if it fights with darkness. 
If it falls into the soil, it becomes like a sowing tree. Life is like a human being who fights with life ...
The greatness of the word is better than the money that will be dissolved as the icy.
 Wasting time is to exploit you .......
 Absolutely good. Abandon wherever evil is.
is one finger tearing over ten fingers that look at you.
 is not good. No one should be harmed. It's harder to get true friends.
🌺 satisfies the clay of gold.
🌺 Books and friends should be nice.
 Could be a normal man in the world. But at least one of you can live to look great all over the world.
🌺 We have learned to jog in the air and swim in fish like water. But we do not know how to live like humans on earth.
🌺 The appetite of the lion will not be grass. The good thing is to be wrapped up,
🌺 How much sandalwood will not lose the fragrance of the sandalwood. No matter how many hardships he / she does not lose self confidence.
🌺 man needs a lamp. It needs a mirror, one is light, and another one. They may not be lamp, but they can be a mirror.Life is the only way to divide the knowledge that he knows.

వ్యక్తిత్వ వికాస సూత్రాలు

వ్యక్తిత్వ వికాస సూత్రాలు
======================
🌺నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది.
చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది. 
మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మసరుతాము...
🌺ఐసులా కరిగిపోయే ఐశ్వర్కం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది.
🌺 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.......
🌺 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.
🌺 నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న....
🌺 మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు.
🌺 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.
🌺 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.
🌺 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.
🌺 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.
🌺 మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు .
🌺 ఆకలి వేసినా సింహం గడ్డిమేయదు. కష్టాలెన్ని చుట్టు ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
🌺 ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.
🌺 మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవితం.


Monday, 21 August 2017

ॐ నమో నారసింహాయనమః ॐ 




ఆంత్ర మాలాధరం శంఖ 
చక్రాబ్జాయుధ ధారిణం       
శ్రీ నృసింహం మహావీరం 
నమామి ఋణ ముక్తయే || 

ॐ నమో నారసింహాయనమః

   

ॐ శ్రీ గణేశాయనమః


 ॐ శ్రీ గణేశాయనమః

 ధనములేల? సుఖములేల?  ధరణినేలు శక్తులున్
ఘనతయేల? హయములేల? కరులవేల? గణపతీ!
జనులకింక నీపదాంబుజాత దివ్యపూజలే
మునులకైన, ఘనులకైన ముక్తినొసగు మార్గముల్.




      ॐ శ్రీ గణేశాయనమః

శ్రీరామ


శ్రీరామ


ప్రాతఃస్మరామి హనుమంతమనంత వీర్యం*
*శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం*
*లంకాపురీ దహన నందిత దేవబృందం*
*సర్వార్ధ సిద్ధి సదనం ప్రధిత ప్రభావమ్.*


     🌳   *...శుభోదయం...*   🌳