Friday, 30 September 2016

Wednesday, 28 September 2016

ఓం :

అజ్ఞానము మురికిలాంటిది 
జ్ఞానము వజ్రములాంటిది 
ధ్యానమనే నీళ్లతో దేన్నీ కడిగినా 
మిగిలేది వజ్రమే  

Tuesday, 27 September 2016

kasireddynayana (sri sri sri avadutha kasinayana foundation)



ఆత్మ ఫలమేమనగా ,
ప్రేమ ,సంతోషము,సమాధానము,
దీర్ఘశాంతము ,దయాళుత్వము ,
మంచితనము ,విశ్వాసము ,
సాత్వకము ,ఆశానిగ్రహము   

సూక్తులు

సూక్తులు 
ఉన్న వాటి విలువ మన దగ్గర ఉన్నంత 
వరకు మనకు అర్థం కాదు 
ఒకసారి  చేజారిన తర్వాత అర్ధమయినా 
ఏమీ చేయలేం 
అది కాలమయినా ,స్నేహితులయిన ,
చివరికి వస్తువులయినా . 

Sri Sri Sri Avadutha Kasinayana Founation

ఓం :
The happiness of your life
depends 
upon the quality
of your thoughts.

Sunday, 4 September 2016

స్నానం


స్నానం

తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని 

రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం

అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని 

మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే 

స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి…

 ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం 
పుణ్యప్రదం…

ఇక స్నానాల్లో కెల్లా చన్నీటిస్నానం ఉత్తమమైనది. ప్రవాహ ఉదకంలో 

స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మద్యమం నూతివద్ద 

స్నానం చెయడం అదమం. వేయిపనులున్నా వాటిని వదిలి సమయానికి 

స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఒకనదిలో స్నానం చేసినప్పుడు ఇంకోనదిని దూషించకూడదు

శరీరాన్ని ఒక ద్రవము, సాధారణముగా నీళ్ళతో తడిపి లేదా నీళ్ళలో మునిగి

 శుభ్రపరచుకోవటాన్ని స్నానం అంటారు. స్నానానికి పాలు, నూనె, తేనె 

వంటి ద్రవపదార్ధాలను ఉపయోగించినా నీటినే ప్రధానముగా వాడతారు. 

తరచూ క్రమంతప్పకుండా స్నానం చేయటం శారీరక శుభ్రతలో భాగంగా

 నిర్వహిస్తారు.

కొన్ని స్పాలలో, ఆయుర్వేద శాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్ధాలతో
 స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి. షాంపేనుతో స్నానం 

చేసిన ఉదహారణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతే కాకుండా ఆరుబయట

 సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా 

పరిగణిస్తారు. ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య 

ప్రజలలో ప్రసిద్ధి చెందినది.

* పురాణాలలో స్నానం

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి 

జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి 

దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం 

అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ 

పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.
* మంత్ర స్నానం

వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన 

మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"

* భౌమ స్నానం

పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర 

మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది 

"భౌమ స్నానం".

* ఆగ్నేయ స్నానం

సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర 

సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది

 "ఆగ్నేయ స్నానం"

* వాయువ్య స్నానం

ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత 

చేయునది "వాయువ్య స్నానం"

* దివ్య స్నానం

లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు 

ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం 

చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం 

అనుకూలించాలి.

* వారుణ స్నానం

పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".

* మానస స్నానం

నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర 

అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం 

"మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషులచేత ఆచరింప

 బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.

* స్నానాలు రకాలు

* మానస స్నానం: దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.

* క్రియాంగ స్నానం: జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.

* దైవ స్నానం: ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.

* మంత్ర స్నానం: వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.

* రుషి స్నానం: ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.

* మానవ స్నానం: ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం
.
* రాక్షస స్నానం: ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.
స్నానం.

* మలాపకర్షణ స్నానం: మాలిన్యం పోవుటకు చేయు స్నానం. 


—...................................









 FB

శ్రీ శ్రీ శ్రీ అవదూత కాశినాయన ఫౌండేషన్

శ్రీ శ్రీ శ్రీ అవదూత కాశినాయన ఫౌండేషన్